YSR |
కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జగన్ అభిమానులు
యువనేత జగన్....వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు...వారి వారి ప్రాంతాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం గ్రామంలో జగన్ ఫ్యాన్స్ ...వైఎస్‌ఆర్ జంక్షన వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు.జగన్‌కు తమ మద్దతు తెలుపుతూ...ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్థం చేశారు.
అబాసుపాలు అవుతున్న అభయ హస్తం
పేద, వృద్ధాప్య మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభయ హస్తం పథకం అబాసుపాలౌతోంది. అధికారులే లబ్దిదారుల వేలిముద్రలు ఫోర్జరీ చేసి ఫించన్ డబ్బులు కాజేస్తున్నారు. . పశ్చిమగోదావరి జిల్లా పందితుల్లూరు గ్రామానికి చెందిన గంగమ్మకు ప్రతి నెలా 2వందల రూపాయలు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. అయితే.....ఈ యేడాది ఫిబ్రవరి నెల నుంచి అభయహస్తం పథకం కింద 5వందల రూపాయలు పెన్షన్ మంజూరైంది. కానీ ..అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగిన పింఛన్ సొమ్ము గంగమ్మకు అందలేదు.
దీంతో.. ఆమెగ్రామ సర్పంచ్‌ను సంప్రదించింది. సర్పంచ్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఐనా ఫలితం కన్పించలేదు. దీంతో టీవీ ఫైవ్ సిబ్బంది రంగంలోకి దిగి ఆరా తీయగా....గంగమ్మ వేలిముద్రలతో ఎవరో డబ్బులు డ్రా చేసినట్లు బైటపడింది.విషయం తెలుసుకున్న పైఅధికారులు...అక్రమాలకు పాల్పడ్డ సదరు ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు...అంతేకాకుండా.. ఇప్పటినుంచి ...గంగమ్మకు ప్రతి నెలా 5వందల రూపాయల చొప్పున పెన్షన్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ హామీకూడా గాల్లో కలిసింది.
బాధితురాలు పించన్ సొమ్ము కోసం మళ్లీ అధికారులను ఆశ్రయిస్తే...విచారణ ఇంకా పూర్తి కాలేదని.....దొంగ అధికారులకు ఉన్నతాధికారులు వత్తాసు పలుకుతున్నారు. అయితే.. గంగమ్మకు పొరపాటున అభయహస్తం పథకం వచ్చిందని...స్థానిక అధికారులు కొత్త కథలు చెబుతున్నారు.వచ్చిన పింఛన్ డబ్బును తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమచేస్తున్నామని మాయ మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు. పేదల కోసం ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకం దోపిడీకి గురవడంతో గంగమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
అధికారుల దోపిడీ కారణంగా వచ్చే200 రూపాయల పింఛన్ కూడా అందకుండా పోయిందని బాధపడుతోంది. గంగమ్మ పింఛన్ డబ్బులు కాజేసిన అధికారులపై...స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు అధికారులకు ప్రభుత్వమే తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నారు
.
0 comments for "NEWS"